హైద‌రాబాద్ మెట్రో రైలు వేళ‌ల్లో మార్పులు

N ANJANEYULU
హైద‌రాబాద్ న‌గ‌రంలో న‌డిచే మెట్రో రైలు వేళ‌ల్లో హెచ్ఎంఆర్ఎల్ మార్పులు చేసిన‌ది. రేపటి నుంచి ఉద‌యం 6 గంట‌ల నుంచి తొలి మెట్రో రైలు ప్రారంభం కానున్న‌ది. రాత్రి 10.15 గంట‌ల‌కు చివ‌రి స్టేష‌న్ నుంచి మెట్రో రైలు ప్రారంభం కానున్న‌ది. రాత్రి 10.15 నుంచి ప్రారంభ స్టేష‌న్ నుంచి ప్రారంభం అయి చివ‌రి స్టేష‌న్‌కు రాత్రి 11.15 గంట‌ల‌కు గ‌మ్య‌స్థానానికి ఆ రైలు చేరుకోనున్న‌ది. మెట్రో సేవ‌లు పొడ‌గించాల‌ని ట్విట్ట‌ర్‌లో ఓ ప్ర‌యాణికుడు నిన్న తెలంగాణ ఐటీ, పుర‌పాల‌క మంత్రి కేటీఆర్ ను కోరాడు. మెట్రో ఎండీ దృష్టికి కేటీఆర్ ఈ అంశాన్ని తీసుకెళ్ల‌డంతో హెచ్ఎంఆర్ఎల్ వెంట‌నే ఈ మార్పులు చేసిన‌ది.

క‌రోనా స‌మ‌యంలో కొద్ది రోజులు మెట్రో సేవ‌లు నిలిచిపోవ‌డంతో న‌ష్టాలు వ‌చ్చాయి. క‌రోనా లాక్‌డౌన్ ముగిసిన త‌రువాత కొద్ది రోజుల పాటు  కాస్త మెట్రో రైలు త‌క్కువ స‌మ‌యం న‌డ‌వ‌డంతో ఆదాయం అంత‌గా రాలేదు.  క‌రోనా ప్ర‌భావం అంత‌గా లేక‌పోవ‌డం, పుల్ టైమ్ న‌డ‌వ‌డం, కార్యాల‌యాలు అన్ని తెరుచుకోవ‌డంతో ఆదాయం ఇప్పుడు మెట్రోకు బాగానే వ‌స్తుంది. ఇప్పుడు స‌మ‌యాన్ని కాస్త ఉద‌యం 6 గంట‌ల నుంచి అన‌గా గంట ముందు నుంచి న‌డ‌ప‌డంతో మ‌రింత ఆదాయం పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: