ఎవరు ఆత్మహత్య లు చేసుకోవద్దు..! నిరుద్యోగులకు బండి సంజయ్ సూచన
రాజకీయ లబ్ది కోసం మేము ఉద్యమం చేయడం లేదని, తెలంగాణ ఉద్యమ సమయంలో ఏమి మాట్లాడావ్ అని.. ఇప్పుడు ఏమి చేస్తున్నావ్ అని నిప్పులు చెరిగారు సంజయ్. నిరుద్యోగులకు బీజేపీ అండగా ఉంటుందని, ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు అని స్పష్టం చేశారు. ఆత్మహత్యలు చేసుకొని తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చవద్దన్నారు. పక్క రాష్ట్రం ఏమి చేస్తున్నది.. నువ్వు ఏమి చేస్తున్నావ్ చెప్పాలని కేసీఆర్ ను నిలదీశారు. కేవలం ప్రగతి భవన్, ఫార్మ్‌హౌస్‌లో ఉండడానికి కాదు తెలంగాణ ముఖ్యమంత్రిని చేసింది అని మండిపడ్డారు. నవంబర్ 16న నిరుద్యోగల మిలియన్ మార్చ్ నిర్వహిస్తాం అని బండి సంజయ్ పేర్కొన్నారు.