ధూళిపాళ్ళను జగన్ వదలరా...?

టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర పై ప్రభుత్వం మరో అస్త్రం ప్రయోగించే అవకాశాలు కనపడుతున్నాయి. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ ను స్వాధీనం చేసుకునేందుకు నోటీసులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. సహకార చట్టం లోని సిక్స్ ఏ కింద ట్రస్టును ఎందుకు స్వాధీనం చేసుకోకూడదు వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్లాల్ నోటీసులు ఇచ్చారు.
వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులో కమిషనర్ స్పష్టం చేసారు. డి వి పి ట్రస్టు ద్వారా డివిసి ఆసుపత్రి నడుస్తుంది. పాల రైతులు వారి కుటుంబ సభ్యులకు 50 శాతం డబ్బులకి వైద్యం అందిస్తూ  వస్తుంది ఈ ఆసుపత్రి . గతంలో సంగం డైరీ స్వాధీనానికి ప్రయత్నం చేసి కోర్టు కొట్టి వేయటం తో గతంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గింది. తాజాగా డివిసి ట్రస్ట్, డివిసి ఆసుపత్రిపై ఏపీ ప్రభుత్వం కన్నేసింది అని ఆరోపణలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp

సంబంధిత వార్తలు: