అసభ్యకరంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు : మంచు విష్ణు

N ANJANEYULU
మంచు విష్ణు మా అధ్య‌క్షునిగా ఎన్నికైన విష‌యం విధిత‌మే. బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత మా అసోసియేషన్ అభివృద్దికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ త‌రుణంలో హీరోయిన్స్ గురించి తప్పుగా వ్యవహరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది.  సినీ ఇండ‌స్ట్రీలో మ‌హిళా న‌టుల‌ పై అభ్యంతరకర వీడియోలు పెడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.. తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నిర్వ‌హించిన స‌న్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు నటుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నాయని.. అసభ్యకరంగా వ్యవహరించే  ఛానళ్లపై చ‌ర్యలు తీసుకుంటామన్నారు.


కొన్ని యూట్యూబ్ చాన‌ల్స్ థంబ్‌నైల్స్ హ‌ద్దులు మీరుతున్నాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు.  నటీమణులు మన ఆడుపడుచులని.. వారిని గౌరవించాలని  కోరారు. హీరోయిన్స్ గురించి అభ్యంతరకరమైన‌ వీడియోలు పెడితే ఉపేక్షించమన్నారు. యూట్యూబ్ చానళ్ల నియంత్రణకు ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి యూట్యూబ్ చానళ్లను నియంత్రించడం తన ఎజెండాలో ఒక‌ అంశమని తెలిపారు. తెలుగు మీడియా ఎప్పుడూ హద్దులు దాటలేదని తెలిపారు.  తెలుగు మీడియా తన కుటుంబానికి.. చిత్రపరిశ్రమకు సహకారం అందిస్తూనే ఉందని వెల్ల‌డించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: