చింతూరులో వైసీపీ నాయ‌కులు ధ‌ర్నా

N ANJANEYULU

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావ‌రి జిల్లా రంప‌చోడ‌వ‌రం ఎమ్మెల్యే ధ‌న‌ల‌క్ష్మీ ఆదివారం ఉద‌యం చింతూరులో ఉన్న గిరిజ‌న సంక్షేమ గురుకుల పాఠ‌శాల‌లో లైబ్ర‌రీ ప్రారంభించ‌డానికి వెళ్లింది. ఉద‌యం నుంచి మ‌ధ్యాహ్నం వ‌ర‌కు క‌లెక్ట‌ర్ కోసం ఎమ్మెల్య నాగుప‌ల్లి ధ‌న‌లక్ష్మీ ఎదురుచూశారు. ప్రోటోకాల్‌పై అధికారులు నిర్ల‌క్ష్యం వ‌హించారు.
 ఉద‌యం నుంచి మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ఎమ్మెల్యే క‌లెక్ట‌ర్ కోసం ఎదురుచూసినా.. అధికారులు మాత్రం ప్రోటోకాల్ పై నిర్ల‌క్ష్యం వ‌హించార‌ని వైసీపీ నాయ‌కులు ధ‌ర్నా చేపట్టారు. చింతూరు ఐటీడీఏ అధికారుల‌పై ఎమ్మెల్యే అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. క‌లెక్ట‌ర్ హ‌రికిర‌ణ్ భ‌ద్రాచ‌లం ఆల‌యానికి వెళ్లి రావ‌డంతో  కార్య‌క్ర‌మం కాస్త ఆల‌స్యంగా ప్రారంభం అయింది. అధికారులు ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, ప్రోటోకాల్ పాటించ‌డం లేద‌ని ఎమ్మెల్యే అధికారుల‌పై మండిప‌డ్డారు. అదేవిధంగా వైసీపీ కార్య‌క‌ర్త‌లు కొద్దిసేపు ధ‌ర్నా చేప‌ట్టారు. స్థానిక ఎమ్మెల్యే విష‌యంలో ప్రోటోకాల్ పాటించ‌క‌పోవ‌డంపై ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: