రేవంత్ కూడ‌ లీడ‌రా..? మంత్రి మ‌ల్లారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

N ANJANEYULU
తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డిపై మంత్రి మ‌ల్లారెడ్డి ఇవాళ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రేవంత్‌రెడ్డి కూడ ఒక లీడ‌రేనా అని, రేవంత్‌ను ప్రజలు  ఎవ‌రు నమ్మరు అని పేర్కొన్నారు. రేవంత్ ఎప్పుడు ఏమి మాట్లాడుతారో  క‌నీసం ఆయ‌న‌కే  తెలియ‌ద‌ని వెల్ల‌డించారు. ప్ర‌జ‌ల‌ను తిక‌మ‌క పెడుతున్నార‌ని ఆరోపించారు. హుజూరాబాద్ ఉపఎన్నిక సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. 

 
రాష్ట్రంలో దివాలా తీసిన కాంగ్రెస్ పార్టీకి రేవంత్‌రెడ్డి అధ్య‌క్షుడు అయ్యాడ‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు.  హుజూరాబాద్‌లో ఇప్ప‌టికే టీఆర్ఎస్ గెలుపు ఖాయ‌మైంద‌ని పేర్కొన్నారు. అస‌లు బీజేపీ ఏమి చేసిన‌దని ఓట్లు అడుగుతోంద‌ని మంత్రి ప్ర‌శ్నించారు. తెలంగాణ‌కు బీజేపీ ఎంపీలు క‌నీసం ఒక్క రూపాయి అయినా తీసుకొచ్చారా అని అడిగారు. పాలలో తోడుపెట్టి పథకాల్లో వాటా ఉందని బీజేపీ చెప్పుకుంటోందని.. ఏది ఏమైనా హుజూరాబాద్ ఉపఎన్నిక‌లో మాత్రం టీఆర్ఎస్ గెల‌వ‌డం ఖాయ‌మ‌ని మంత్రి మ‌ల్లారెడ్డి జోస్యం చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: