వల్లభనేని వంశీ పై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్

N ANJANEYULU
వ‌ల్ల‌భ‌నేని వంశీపై మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర ఫైర్ అయ్యారు. ఇటీవ‌ల టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు, ప‌రిటాల సునీత‌ల‌పై వ‌ల్ల‌భ‌నేని వంశీ చేసిన వ్యాఖ్య‌ల‌కు శ‌నివారం మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర కౌంట‌ర్ ఇచ్చారు.  వల్లభనేని వంశీ విశ్వాసఘాతకుడు అని, వంశీది కృష్ణా జిల్లా అని చెప్పుకోవడానికి  నాకు సిగ్గు వేస్తుంద‌ని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా ఆడపడుచులను కించపరిచే విధంగా వంశీ వ్యాఖ్య‌లు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు భిక్షతోనే గన్నవరంలో వంశీ ఎమ్మెల్యే అయ్యాడు. ఇప్పుడు ఆడ‌బిడ్డ‌లు త‌ల‌దించుకునేలా మాట్లాడిన వంశీకి అమ్మ‌వారి శాపం త‌గులుతుంద‌ని వ్యాఖ్యానించారు.
కృష్ణా జిల్లా మంత్రులతో వంశీ ప్రతిరోజు ఇంట్లో రాత్రి వేళల్లో ఏమి చేస్తాడో ప్రజల‌కు తెలుస‌ని పేర్కొన్నారు. త్వరలో బెంజ్ సర్కిల్లో బట్టలు లేకుండా వంశీని నిలబెట్టే రోజు వస్తుందని చెప్పారు. వంశీ ఇంట్లో ప్రతి రోజు కృష్ణా జిల్లా మంత్రులు అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తార‌ని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: