భార్య మరిదితో పెట్టుకున్న అక్రమసంబంధం భర్త హత్యకు దారితీసింది. ఈ ఘటన హైదరాబాద్ లోని హయత్ నగర్ లో చేటు చేసుకుంది. మొదట కారులో డెడ్ బాడీ లభించగా పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. కార్ లో దారుణ హత్య కు గురి అయిన లారీ డ్రైవర్ కాచిగూడ కి చెందిన మహుమద్ ముస్తాక్ గా పోలీసులు గుర్తించారు. మరిదితో అక్రమ సంబంధం కారణంగానే భార్య భర్తను హత్య చేసినట్టు నిర్ధారణ అయ్యింది.
ముస్తాక్ ను అతడి భార్య మరియు తమ్ముడు కలిసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్య జరిగిన అనంతరం భార్య, ముక్తాన్ సోదరుడు నగర శివారులలో మృతదేహాన్ని పడేశారు. రోడ్డు పై కారు ఆగిపోవడంతో కార్ లో మృత దేహం పై కారం చల్లి అలానే వెళ్లిపోయారు. ఈ కేసులో ముస్తాన్ భార్యను , మృతుడి తమ్ముడిని పోలీసులు అదుపులోకి తీసకుని విచారిస్తున్నారు. ఇద్దరి మధ్యా ఉన్న అక్రమ సంబందమే హత్య కు కారణం అని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వదిన మరిదిని విచారిస్తున్నారు.