ప‌ట్టాభికి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు.. న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు..!

N ANJANEYULU
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన టీడీపీ నేత పట్టాభికి  ఎట్ట‌కేల‌కు శ‌నివారం బెయిల్ మంజూరైంది. కొన్ని రోజుల క్రితం మీడియా స‌మావేశంలో టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభిరామ్ ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్‌జ‌గ‌న్‌పై అనుచిత‌వ్యాఖ్య‌లు చేసిన విష‌యం విధిత‌మే. దీంతో టీడీపీ, వైసీపీ నేతల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం చోటు చేసుకున్న‌ది. టీడీపీ కార్యాల‌యం దాడి, టీడీపీ రాష్ట్ర బంద్‌, చంద్ర‌బాబు దీక్ష‌, వైసీపీ జ‌నాగ్ర‌హ దీక్ష‌ల మ‌ధ్య రాష్ట్రం అంత‌టా ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొన్న విష‌యం తెలిసిందే.
తాజాగా ప‌ట్టాభికి బెయిల్ మంజూరు చేసే స‌మ‌యంలో హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. రెండు వైపుల నుంచి లాయ‌ర్లు త‌మ వాద‌నలు వినిపించారు. ప‌ట్టాభి చేసిన విమ‌ర్శ‌ల సీడీని కోర్టుకు న్యాయ‌వాదులు స‌మ‌ర్పించారు. రూల్ ఆఫ్ లా పాటించాల‌ని కోర్టు వ్యాఖ్యానించింది. 41 సీఆర్పీసీ స‌మాధానం రాకుండానే ఎందుకు అరెస్ట్ చేశార‌ని ఏపీ పోలీసుల‌పై హై కోర్టు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది. పోలీసులు కాస్త దూకుడు తగ్గించుకోవాల‌ని సూచించింది. ఎలా ప‌డితే అలా ప్రొసిజ‌ర్ లేకుండా చేస్తారా అని జ‌డ్జీ పోలీసుల‌పై గ‌రం అయ్యారు.  థ‌ర్డ్ క్లాస్ మేజిస్ట్రేట్ రిమాండ్ ఎలా ఇచ్చారో చెప్పాల‌ని హైకోర్టు వివ‌ర‌ణ కోరింది. గ‌త బుధ‌వారం పోలీసులు ప‌ట్టాభిని అరెస్టు చేయ‌గా.. తాజాగా ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్  హైకోర్టు మంజూరు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: