మా నాయ‌కుడికోస‌మే సుప్రీంను ఆశ్ర‌యించా : ర‌ఘురామ‌

సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం ఛార్జ్ షీట్ వేసిన ఒక సంవత్సరం లోపలే విచారణ పూర్తి చేయాలని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. తొందరగా విచారణ పుర్తియై మా నాయకుడు త్వరగా బయట పడాలని సుప్రీం కోర్టును ఆశ్రయించాను అంటూ చెప్పారు. మా నాయకుడు ఏ త్తప్పు చేయలదనేది త్వరగా ఋజువు కావాలనే సుప్రీం కోర్టును ఆశ్రయించాను అంటూ వ్యాఖ్యానించారు. త్వరగా  నిర్దోషిగా బయటపడితే ప్రతిపక్షాలు సహా ఎవరికి మాట్లాడే అవకాశం ఉండదంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 

కింది కోర్టు లో దాఖలు చేసిన  బెయిల్  పిటీషన్ వేరు.. సుప్రీం కోర్టులో వేసిన పిటేషన్ వేరని ర‌ఘురామ స్ప‌ష్టం చేశారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారమే ఈ పిటిషన్ వేసానని చెప్పారు. 11 ఛార్జ్ షీట్లో  కోర్టుల్లో హాజరు నుండి రెండు వేలకు పైగా సార్లు జగన్  వాయిదా కోరారని ర‌ఘురామ వ్యాఖ్యానించారు. రాళ్లు విసరడం, గ్లాస్ పగలగొట్టడం నిరసన లో భాగమ‌ని అది తప్పు కాదు అని డీజీపీ గారు చెప్పడం ద్వారా ఏమి సందేశం ఇస్తున్నారు అంటూ ర‌ఘురామ ప్ర‌శ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: