డ్ర‌గ్స్‌కు ఏపీ కేరాఫ్ : చంద్ర‌బాబు

N ANJANEYULU

మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కార్యాలయంలో చేప‌ట్టిన‌ 36 గంట‌ల దీక్ష శిభిరంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి శుక్ర‌వారం విలేక‌ర్ల‌తో మాట్లాడారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ డీజీపీ ఆపీస్‌కు 100 గ‌జాల దూరంలో  ఉన్న టీడీపీ కార్యాల‌యంపై దాడి జ‌రిగింద‌ని గుర్తు చేశారు. డ్ర‌గ్స్‌పై తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తొంద‌ని పేర్కొన్నారు. పోలీసులు, అధికార యంత్రాంగానికి భ‌య‌ప‌డి స‌రెండ‌ర్ అవ్వాలా..? అని ప్ర‌శ్నించారు.
వైకాపా నాయ‌కులు పార్టీ ఆర్థికంగా, శార‌రీకంగా, మాన‌సికంగా వేధించారని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో  పిల్ల‌ల భ‌విష్య‌త్ నాశ‌నం అయ్యే డ్ర‌గ్స్ వినియోగం జ‌రుగుతున్న‌ది.  తెలంగాణ రాష్ట్రంలో ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి కేసీఆర్ డ్ర‌గ్స్‌పై స‌మీక్ష నిర్వ‌హించి డ్ర‌గ్స్ లేకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి స‌మ‌యం లేదా స‌మీక్ష నిర్వ‌హించ‌డానికి అని ప్ర‌శ్నించారు. దాడుల కోసం స‌మీక్ష చేప‌డుతారా అని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో ఏమి జ‌రుగుతుందో అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంద‌న్నారు. గ‌తంలో ముఖ్య‌మంత్రి ద‌శ‌ల‌వారిగా మ‌ద్యం నిషేదం చేస్తాన‌ని చెప్పిన మాట‌లు ఏమ‌య్యాయ‌ని వెల్ల‌డించారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: