అస‌త్య ప్ర‌చారం చేసేవారికి స‌మంత షాక్‌?

Garikapati Rajesh

స‌మంత‌-నాగ‌చైత‌న్య విడాకులు తీసుకున్న త‌ర్వాత స‌మంత‌పైనే ఎక్కువ‌గా ప్ర‌చారం జ‌రిగింది. విడాకుల‌కు కార‌ణం స‌మంతేనంటూ ర‌క‌ర‌కాల వార్త‌లు పుకార్లు చేశాయి. వాట‌న్నింటిని స‌మంత తిప్పికొట్టింది. యూట్యూబ్‌లో రెండు ఛాన‌ళ్లు సుమ‌న్ టీవీ, తెలుగు పాపుల‌ర్ టీవీతోపాటు డాక్ట‌ర్ సీఎల్ వెంక‌ట్రావు కూడా స‌మంత‌పై అవాకులు చెవాకులు పేలారు. ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడితే వాటిని ఈ రెండు చాన‌ళ్లు ప్ర‌సారం చేశాయి. ఇప్పుడు స‌మంత ఆ వీడియో క్లిప్స్ ను తొల‌గించ‌డంతోపాటు బ‌హిరంగంగా వారు త‌న‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కూక‌ట్‌ప‌ల్లి కోర్టును ఆశ్ర‌యించింది. ప‌రువు న‌ష్టం దావా వేసింది. ఎంత‌కు అనేది స్ప‌ష్ట‌త రాలేదు. ముందుగా వారు త‌న‌కు క్ష‌మాప‌ణ చెప్ప‌డంతోపాటు ఇక‌నుంచి దుష్ప్ర‌చారం చేయ‌కుండా నిరోధించాల‌ని, ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌సార‌మైన వీడియోల‌ను తొల‌గించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశాలు ఇవ్వాల‌ని కోరింది. నాగ‌చైత‌న్య‌తో ముగిసిన త‌న వైవాహిక జీవితానికి సంబంధించి ఇక‌నుంచి ఎవ‌రూ ఎటువంటి క‌థ‌నాలు ప్ర‌సారం చేయ‌కుండా చూడాల‌ని, త‌న వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ట‌త‌కు భంగం వాటిల్ల‌కుండా చూడాల‌ని కోర్టును స‌మంత అభ్య‌ర్థించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: