"మా" పై వర్మ షాకింగ్ కామెంట్స్..మంచు మనోజ్ కౌంటర్ ఎటాక్..!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మా ఎన్నికల పై కూడా తన స్టైల్ లో స్పందించాడు. ఎప్పుడూ వివాదాలతో హాట్ టాపిక్ నిలిచే రామూ మా పై వివాదాస్పద కామెంట్స్ చేశాడు. సిని "మా" అనేది జోకర్ లతో నిండిపోయింది అంటూ రామ్ గోపాల్ వర్మ సంచలన పోస్ట్ చేశారు. అయితే రామ్ గోపాల్ వర్మ కు అదే స్టైల్ లో మంచు మనోజ్ కూడా కౌంటర్ ఇచ్చారు. ఆర్జీవీ మా అనేది సర్కస్ అందులో వాళ్లంతా జోకర్స్ అనడం తో మనోజ్ మీరు దానికి రింగ్ మాస్టర్ సార్ అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇక మనోజ్ చేసిన పోస్ట్ కు సూపర్ గా కౌంటర్ ఇచ్చారు సార్ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

ఇదిలా ఉంటే మా అధ్యక్ష ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ కు పోటీగా నిల్చున్న మంచు మనోజ్ అన్న మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలిచిన సంగతి తెలిసిందే  ఈ నేపథ్యంలోనే వర్మ చేసిన వ్యాఖ్యలు మనోజ్ ను హర్ట్ చేసినట్టు  కనిపిస్తోంది. దాంతో రామూ కు తనదైన రీతిలో మనోజ్ ఇచ్చారు. ఇక మా ఎన్నికల హంగామా లో జరిగిన గొడవలలో ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు విష్ణు మోహన్ బాబు పై ఆరోపణలు చేయగా మనోజ్ ను మాత్రం ప్రశంసలతో ముంచెత్తారు. అతడు లేకుంటే ఇంకా గొడవలు జరిగి ఉండేవని చెప్పారు. దాంతో మనోజ్ మరోసారి హీరో అయ్యాడు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: