గర్భిణీ మీద అరాచకం.. ఎస్సై సస్పెషన్!

Chaganti
ఏదయినా విషయం మీద పోలీసు స్టేషన్ కు వెళితే ఎలా రిసీవ్ చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, కానీ ఒక కేసులో కనుక అనుమానితులు అని భావిస్తే వాళ్ళ తీరు ఎలా ఉంటుందో ఇక చెప్పక్కర్లేదు,  రాజమండ్రి కొత్తపేట ఎస్ ఐ ఎల్ శ్రీను నాయక్ ను సస్పెన్షన్ చేస్తూ ఏలూరు రేంజ్ డిఐజి కె వి మోహన్ రావు ఉత్తర్వులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది, హత్య కేసులో అనుమానితురాలిగా ఉన్న గర్భిణీ ని అక్రమంగా ఎస్ ఐ ఎల్ శ్రీను నాయక్ నిర్బందించినట్టు చెబుతున్నారు. దీంతో ఎస్ఐ తీరు పై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా ఉండడంతో బాధితురాలు హైకోర్టు ను ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాలు మేరకు అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యర్ విచారణ చేపట్టారు, అక్రమ నిర్బంధం  వాస్తవమేనని తేలడంతో  ఎస్ఐ శ్రీను నాయక్ ను సస్పెండ్ చేస్తూ ఏలూరు డి ఐ జి కె వి మోహన్ రావు ఆదేశాలు జారీ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: