ఏపీలో పరీక్షలు : సర్కార్ కీలక సూచనలు!

Chaganti
అమరావతిలో వైద్యారోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ మీడియా తో మాట్లాడారు, పరీక్షల వేళ తగు జాగ్రత్తలు పాటించాలని, విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం తరపున ఆయన  సూచనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్కూళ్లు, కళాశాలలో పరీక్షలు కొనసాగుతున్నాయని, ఈ  సమయంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కోవిడ్  నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. పరీక్ష హాల్, కాలేజ్/స్కూల్ క్యాంపస్ లో, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ప్రతి విద్యార్థి తన ముక్కు, నోరు మూసి వుండే విధంగా మాస్కులు ధరించాలని అన్నారు. కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి, తమ చేతులను తరచుగా శుభ్రపరచుకోవాలని, పరీక్ష హాలులోకి ప్రవేశించే సమయం లో, నిష్క్రమించే సమయం లో విద్యార్థులు ఇతరులు నుంచి సురక్షిత భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. కోవిడ్ ప్రోటోకాల్  నిబంధనలపై తల్లిదండ్రులు వారిని చైతన్యవంతం చేయాలని ఆయన అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: