హైకోర్టులో ఏపీకి మ‌రో ఎదురుదెబ్బ‌?

Garikapati Rajesh

 పోలీస్‌ కంప్లైంట్ అథారిటీ చైర్మన్‌గా జస్టిస్ కనగరాజు నియామకాన్ని ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఆయ‌న నియామకాన్ని న్యాయవాది పారా కిషోర్ హైకోర్టులో సవాల్ చేసిన సంగ‌తి తెలిసిందే. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ప్ర‌భుత్వం జీవో జారీచేసిందంటూ హైకోర్టు క‌న‌గ‌రాజు నియామ‌కాన్ని సస్పెండ్ చేసింది. ఆయ‌న నియామకం చెల్లదని న్యాయస్థానం అభిప్రాయపడింది. పిటిషనర్ తరపున న్యాయవాది ఇంద్రనీల్‌బాబు వాద‌న‌లు వినిపించారు. ఏపీ పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్గా జస్టిస్ కనగరాజును ఏపీ ప్రభుత్వం కొంత‌కాలం క్రితం నియ‌మించింది. అంత‌కుముందు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా ఉన్న నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్ స్థానంలో కూడా క‌న‌గ‌రాజును నియ‌మించింది. అయితే ఆ నియామ‌కాన్ని కూడా కోర్టు కొట్టేసి ర‌మేష్‌కుమార్‌కు మార్గం సుగ‌మం చేసింది. తాజాగా పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మ‌న్‌గా కూడా నియామ‌కాన్ని కొట్టేసింది. జ‌స్టిస్‌గా అనుభ‌వం ఉన్న క‌న‌గ‌రాజులాంటివారు కూడా ప్ర‌భుత్వం త‌ర‌ఫున వ‌చ్చే ప‌ద‌వుల‌కు ఆశ‌ప‌డ‌టం, చివ‌ర‌కు త‌మ పేరు, ప్ర‌తిష్ట‌ల‌కు భంగం క‌లుగుతుండంవంటి సంఘ‌ట‌న‌లు చూసైనా వేర్వేరు ప‌ద‌వుల్లో నియ‌మితుల‌య్యేవారు నిబంధ‌న‌ల ప్ర‌కారం వ్య‌వ‌హ‌రించాల‌ని న్యాయ‌నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: