నేడే ఏపీ కేబినేట్: సంచలన నిర్ణయం దిశగా జగన్ అడుగులు...?

పేదల ఇల్లు క్రమబద్దీకరణ పేరుతో దశబ్దాల నుండి ఉన్న బకాయిలు పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందనే కామెంట్స్ వినపడుతున్నాయి. ఇలా బకాయిలు ఉన్న పేదల నుండి వాటి వసూలుకు కేబినేట్ లో నిర్ణయం తీసుకునే సూచనలు కనపడుతున్నాయి. పేదల బకాయిలను గతప్రభుత్వాలు లైట్ తీసుకోగా... వాటి నుండి కూడా 4800 కోట్లు వసూలుకు నేటి సర్కారు ప్రయత్నం చేస్తుందనే విమర్శలు వినపడుతున్నాయి.
కొంత రాయితీ ఇచ్చి వసూలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 1983 నుండి ఇప్పటి వరకు అలా బకాయి ఉన్న పేదలు 46 లక్షలు ఉంటారని అంచనా వేస్తుంది. వీరి నుండి బకాయిలు వసూలు చేసి వారికి మాత్రమే క్రమబద్దీకరణ చేసి పట్టా ఇవ్వాలని నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నాయి. కొత్తగా బద్వేలు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ఆమోదం తెలియజేసే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు ప్రతిపాదనపై చర్చించనున్న కేబినేట్ చర్చిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: