రాజెక్కడ: పోలీసులపై కేసీఆర్ సీరియస్...?

తెలంగాణాలో ఆరేళ్ళ చిన్నారి రేప్ ఘటన సంచలనంగా మారింది. రేప్ ఘటనకు సంబంధించి తెలంగాణా పోలీసులు సీరియస్ గా దృష్టి పెట్టారు. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి విపక్షాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఘాటు విమర్శలు చేస్తున్నాయి. తాజాగా కేబినెట్ భేటీ నేపథ్యంలో చైత్ర ఘటనపై ప్రభుత్వం పై ప్రతిపక్షాలు ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. నిందితుడి విషయంలో సీఎం సీరియస్ గా ఉన్నారని అంటున్నారు.
సీఎం ఆదేశాల నేపథ్యంలో హోం మంత్రి , సత్యవతి రాథోడ్ లు బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇవాళ్టి కేబినెట్ కో చైత్ర ఘటనపై నిర్ణయం తీసుకొనున్నారు కేసీఆర్.  అప్రమత్తమైన పోలీస్ శాఖ భారీగా బృందాలను కేటాయించింది. తక్షణమే నిందితుణ్ణి పట్టుకోవాలని హోంమంత్రి  ఆదేశాలు ఇచ్చారు. కేబినెట్ నడుస్తుండగా ప్రగతి భవన్ ముట్టడికి వామపక్ష, ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: