తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక చర్చలు?

Chaganti
ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది, ఈ నెల 25 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఆరు నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో సమావేశాల తేదీలు ఖరారు. చేసే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే దళిత బంధు అమలు పై చర్చ, ప్రతి సంవత్సరం బడ్జెట్ లో 20 వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకునే దిశగా ఈ చర్చలు జరగనున్నాయని అంటున్నారు. శాసనసభ లో ప్రతిపక్షాల మాటలకు కౌంటర్ ఇవ్వడం పై మంత్రులకు కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారని, కృష్ణ జలాల వివాదం పై కేంద్ర పెద్దలను కలిసిన సీఎం కేసీఆర్.అదే విషయంలో మంత్రులతో చర్చలు జరపనున్నారని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య విద్యుత్ వివాదం నేపథ్యంలో ఉద్యోగల భర్తీ పై కేబినెట్ లో చర్చ జరగవచ్చని, నోటిఫికేషన్స్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక మరో పక్క వినాయక నిమార్జనం పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ ఉన్న నేపథ్యంలో ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్, ధాన్యం కొనుగోలు విషయంపై కేబినెట్ చర్చించనుందని, సీజనల్ వ్యాధుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: