ఫైబర్ నెట్ విచారణ... వదలని సిఐడీ...?

ఏపీ ఫైబర్ నెట్ లో అవినీతి జరిగిందని గతంలో విపక్షంలో ఉన్న సమయంలో వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ ఆరోపణలు అప్పట్లో టీడీపీ ప్రభుత్వాన్ని చాలా ఇబ్బంది పెట్టాయి. ఇక ఇప్పుడు ఫైబర్ నెట్ లో జరిగిన అవినీతి ,అక్రమాలపై రెండో రోజు సిఐడీ విచారణ జరుగుతుంది. హరిప్రసాద్, సాంబశివరావు లను విచారించనున్న సిఐడీ అధికారులు... వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంది.
ఉదయం 11 గంటలకు సిఐడీ అధికారులు ముందు హాజరుకానున్న హరిప్రసాద్, సాంబశివరావు... నిన్న కూడా విచారణకు వెళ్ళారు. మొదటి రోజు మూడు గంటలపాటు విచారణ జరిగింది. హరి ప్రసాద్ నాటి ప్రభుత్వ సాంకేతిక సలహాదారు కాగా, సాంబశివరావు కేంద్ర సర్వీసుల అధికారిగా ఉన్నారు. డెప్యూటేషన్ పై కొద్దీ కాలం ఆంధ్రప్రదేశ్ లో సాంబశివరావు సేవలు అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: