కేటీఆర్‌ను దూరం పెడుతున్న ప్ర‌భుత్వ వ‌ర్గాలు?

Garikapati Rajesh

హైద‌రాబాద్‌లో ఆరు సంవ‌త్స‌రాల చిన్నారి హ‌త్యాచార ఘ‌ట‌న‌లో నిందితుడు ప‌రారీలో ఉండ‌గా అత‌ణ్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే ప‌ట్టుకున్నారంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయ‌డం వివాదాస్ప‌దంగా మారుతోంది. కేటీఆర్ ట్వీట్ త‌ర్వాత పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం రూ.10 ల‌క్ష‌ల రివార్డు ప్ర‌క‌టించార‌ని, ఇది దేనికి సంకేత‌మ‌ని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. మంత్రి స‌మాజాన్ని త‌ప్పుదోవ ప‌ట్టించేలా వ్య‌వ‌హ‌రించార‌ని మండిప‌డుతున్నారు. అయితే దీనిపై స్పందించిన మంత్రి త‌న‌కు త‌ప్పుడు స‌మాచారం వ‌చ్చింద‌ని, దానివ‌ల్ల ట్వీట్ చేశాన‌ని, అంద‌రం క‌లిసి నిందితుడికి శిక్ష ప‌డేలా చేద్దామ‌ని, పోలీసులు గాలింపు ముమ్మ‌రం చేశార‌ని, బాధిత కుటుంబానికి న్యాయం చేద్దామ‌న్నారు. కేటీఆర్ ట్వీట్‌పై రేవంత్‌రెడ్డి మండిప‌డుతున్నారు. ఇటువంటి ట్వీట్లు దేనికి సంకేత‌మ‌ని ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు. సామాజిక మాధ్య‌మాల్లో చురుగ్గా ఉండే కేటీఆర్ కూడా ఇలా త‌ప్పుడు ట్వీట్ చేయ‌డంపై అంద‌రూ విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. పూర్తి స‌మాచారం తెలుసుకొని అంద‌రికీ షేర్ చేస్తే బాగుండేద‌ని, ఇప్పుడు అభాసుపాల‌వ‌డం ఆయ‌న వంతైంద‌ని తెలంగాణ రాష్ట్ర‌స‌మితి పార్టీవ‌ర్గాలంటున్నాయి. కేటీఆర్‌కు స‌మాచారం అందివ్వ‌డంలో ప్ర‌భుత్వ‌వ‌ర్గాలు విఫ‌ల‌మ‌య్యాయా?  లేదంటే దూరం పెడుతున్నాయా? అనే చ‌ర్చ న‌డుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: