ఏపీ సర్కార్ మీద హైకోర్టు సీరియస్ !

Chaganti
అక్రమ మైనింగ్ పై ఆంధ్రప్రదేశ్  హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది, తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలంలోని పలు గ్రామాల్లో అక్రమ మైనింగ్ పై కోర్టులో పిటిషన్ దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్ పై హైకోర్టులో మంగళవారం విచారణ జరగగా అక్రమ మైనింగ్ చేస్తున్న వ్యక్తులపై 5 రెట్లు జరిమానా శిక్ష విధించే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు అలసత్వం వహిస్తున్నారు అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది, స్వల్ప జరిమానాలతో వదిలి పెట్టడం ఏమిటని ప్రశ్నించింది హైకోర్టు. ఇసుక మట్టి తవ్వడం  వల్ల రైతుల పొలాలు నదీ గర్భంలో కలిసి పోయే ప్రమాదం ఉందని న్యాయవాది  ఆందోళన వ్యక్తం చేయగా తాత్కాలిక అనుమతులు మాత్రమే ఇచ్చామని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఇక అధికారుల తీరు పట్ల అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు, అక్రమ మైనింగ్ దారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: