వినాయకుడి విగ్రహాలకు జియో ట్యాగింగ్...?

హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం వద్దని న్యాయస్థానం ఆదేశించిన నేపధ్యంలో ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటీ అనే దానిపై అధికారులు కసరత్తు చేసారు. సాగర్ లో నిమజ్జనం చేయకుండా విగ్రహాల మళ్లింపు పై అధికారుల దృష్టి పెట్టారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో బల్దియా ఉందని తెలుస్తుంది. 23 మినీ చెరువులు సిద్ధం చేసారు. విగ్రహాలకు జియో ట్యాగింగ్ కూడా చేయడం గమనార్హం.
బల్దియా సూచించిన చెరువుల్లోనే విగ్రహాలు నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు  చేస్తున్నారు. ఏ విగ్రహం ఏ చెరువులో నిమజ్జనం చేయాలో జియో ట్యాగింగ్ లో పొందుపర్చాలని నిర్ణయం తీసుకున్నారు. విగ్రహాల నిమజ్జనం లో గందరగోళం లేకుండా మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసారు అధికారులు. జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్లతో మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేస్తారు మంత్రి. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల వివరాలతో సమావేశానికి హాజరు కావాలని కేటీఆర్ ఆదేశాలు ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts

సంబంధిత వార్తలు: