బ్రేకింగ్: సొంత పార్టీ నేతనే చంపాలనుకున్న టీడీపీ నేత, పట్టుకున్న ఎస్పీ...?

గుంటూరు టిడిపి కార్పోరేటర్ యల్లావుల అశోక్ యాదవ్ హత్యకు కుట్ర జరిగిన వ్యవహారం ఇప్పుడు నగరంలో సంచలనంగా మారింది. అశోక్ ను మట్టుబెట్టే విధంగా కన్నెగంటి బాలకృష్ణ అనే వ్యక్తి ప్రయత్నం చేస్తున్నట్టుగా గుర్తించారు. గత ఎన్నికలలో అశోక్ ను ఓడించేందుకు బాలకృష్ణ విశ్వ ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. టిడిపి లో అశోక్ ఎదుగుదల విషయంలో బాలకృష్ణ ఇబ్బంది పడ్డాడని సమాచారం.
నిఘా వర్గాల ద్వారా విషయం తెలుసుకున్న ఎస్పీ... ఎస్పీ ఆదేశాలతో బాలకృష్ణ ను అదుపులోకి తీసుకున్న పట్టాభిపురం పోలీసులు... విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో రౌడీ షీటర్ బసవల వాసు హత్య లో కేసులో బాలకృష్ణ పై ఆరోపణలు వినపడ్డాయని మీడియా వర్గాలు అంటున్నాయి. గతంలో ఓ విద్యార్థినికి మత్తు మందు ఇచ్చి నగ్న చిత్రాలు , వీడియో లు తీసిన కేసులో బాలకృష్ణ పై ఆరోపణలు టిడిపి నేతలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: