తండ్రి నుంచి విడుదల.. ఎంగేజ్మెంట్ చేసేసుకున్న బ్రిట్నీ!

Chaganti
గత 13 ఏళ్ళుగా పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ కన్సర్వేటర్గా ఉన్న ఆమె తండ్రి ఇకపై ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన కొద్దీ రోజులకే బ్రిట్నీ స్పియర్స్ తన బాయ్‌ఫ్రెండ్ సామ్ అస్గారితో తన నిశ్చితార్థాన్ని ప్రకటించింది. "ఆడ సింహం" అనే పదంతో చెక్కిన వజ్రపు ఉంగరాన్ని  ప్రదర్శిస్తూ ఉత్సాహభరితమైన పోస్ట్‌తో ఈ ప్రకటన చేసింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ వీడియో పోస్ట్‌తో "నేను నమ్మలేకపోతున్నాను!" అని రాసుకొచ్చింది, అందులో ఆమె కన్ను కొడుతూ కనిపించింది. అస్ఘారి, ఒక నటుడు మరియు వ్యక్తిగత శిక్షకుడు.   తండ్రిని తన కన్సర్వేటర్గా తప్పించాలని ఇటీవల బ్రిట్నీ కూడా కోర్టుకెక్కింది, ఆ సమయంలో కోర్టు బ్రిట్నీకి వ్యతిరేకంగా తీర్పు చెబుతూ తండ్రినే గార్డియన్గా కొనసాగించాలని సూచించింది, దీనిపై ఆన్లైన్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో తాజాగా ఆమె తండ్రి జేమీ స్పియర్స్ ఇకపై తాను బ్రిట్నీకి కన్సర్వేటర్గా ఉండలేనంటూ పిటిషన్ దాఖలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: