కొడాలి నానీ... కుక్కని కొట్టినట్టు కొడుతూ తీసుకెళ్తాo!

Chaganti
గత కొద్ది రోజులుగా మంత్రి కొడాలి నాని టీడీపీ మీద, టీడీపీ అధినేత చంద్రబాబు మీద, ఆయన కుమారుడు లోకేష్ మీద తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొద్ది రోజుల నుంచి టిడిపి కూడా వైసిపి మంత్రుల మీద, ముఖ్యంగా కొడాలి నాని మీద, తీవ్ర అసభ్య పదజాలంతో విరుచుకు పడుతున్న మంత్రుల మీద విమర్శల వర్షం కురిపిస్తోంది. ముందుగా తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్.రాజు విమర్శల వర్షం కురిపించగా, ఆ తర్వాత పిల్లి మాణిక్యాలరావు కూడా అదే బాటలో నడిచారు. ఇప్పుడు తాజాగా గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కూడా కొడాలి నాని మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. "ఒరే కొడాలి నానీ మా ప్రభుత్వం వచ్చిన గంటలో నిన్ను అంకుశం సినిమాలో విలన్ రామిరెడ్డిని కొట్టినట్టు కుక్కని కొట్టినట్టు కొట్టుకుంటూ తీసుకెళ్తాo" అని టిడిపి నాయకుడు యరపతినేని హెచ్చరించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: