అది నా ఆడియో కాదు: అంబటి రాంబాబు

Mamatha Reddy
వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తన పై సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారాన్ని కొట్టి పారేశారు. టీడీపీ పార్టీ పైన తాను మాట్లాడినట్టు వస్తున్న ఆడియో పట్ల రాంబాబు తనదైన శైలి లో ఘాటుగా విమర్శించారు. సదరు ఆడియో లో ఉన్నది తన వాయిస్ కాదని తెలిచి పారేసారు. అంతే కాదు తన పై ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్న వారి పై కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. ఇలాంటి ఆడియో క్లిప్పుల తో తన పరువు తీయాలని చూస్తున్నారని, కానీ అది వారి వల్ల కాదంటూ, ఇది కేవలం ప్రతి పక్ష పార్టీ ల కుట్ర అంటూ అంబటి రాంబాబు దుయ్యబట్టారు. తన రాజకీయం గా ఎదుర్కోలేక తన ప్రత్యర్థులు ఇలాంటి ఫేక్ ఆడియో క్లిప్స్ సృంష్టించి సోషల్ మీడియా లో విడుదల చేస్తున్నారని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: