వైకాపా నిరుద్యోగులకి జాబ్ ఇచ్చారు..మరి రాష్ట్ర నిరుద్యోగులకు.. ?

వైకాపా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారని... మరి రాష్ట్ర నిరుద్యోగులకు ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారని టిడిపి నేత లోకేష్ ప్రశ్నించారు. నిరుద్యోగుల ఉద్యమాన్ని నిర్బంధం తో అణచివేస్తున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం ఇల్లు ముట్టడి కార్యక్రమంలో ఎదుర్కొని నిరసన తెలిపిన యువత ఉద్యమ స్ఫూర్తిని అభినందిస్తున్నానని పేర్కొన్నారు. 

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచి వేస్తున్న పోలీసులకు గత ముఖ్యమంత్రులు ఉద్యోగాలు ఇవ్వకుంటే ఇప్పుడు ఉద్యోగాల్లో ఉండేవారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి విస్మరించిన హామీలను వెంటనే అమలు చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీకి కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని అన్నారు. అరెస్ట్ చేసిన విద్యార్థి నాయకులను యువ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు లోకేష్ పేర్కొన్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: