పాదయాత్ర పక్కాగా ప్లాన్ చేస్తున్న బండి

Chaganti
ఆగస్టు 9 నుంచి బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేయనున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఆయన పాదయాత్ర గురించి వాడివేడిగా చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలోఈ రోజు ఉదయం బీజేపీ సీనియర్ నేతలతో సమావేశమైన బండి సంజయ్ తాజాగా బిజెపి కార్యాలయంలో పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్చార్జిల తో ఏర్పాటుచేసిన మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ మీటింగ్ లో జిల్లా స్థాయిలో సంస్థాగతంగా ఉన్న సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరించడానికి చేయాల్సిన పనులపై చర్చ జరగనుంది. అంతేకాకుండా పాదయాత్రకు సంబంధించిన ప్రణాళికలను కూడా బీజేపీ నేతలకు వివరించనున్నారు. అందులో భాగంగా బిజెపి సీనియర్ నేతలతో ఉదయం జరిగిన మీటింగ్ లో తీసుకున్న పలు కీలకమైన నిర్ణయాలను వివరించబోతున్నారు. 

పాదయాత్ర విజయవంతం చేయడం కోసం 25 కమిటీలను వేయాలని నిర్ణయించుకున్నారు. ఇక పాదయాత్ర కోసం ప్రత్యేకంగా ఒక ఇంచార్జ్, ఇద్దరు నుంచి ముగ్గురు కో ఇంఛార్జ్ లను నియమించబోతున్నారు. ఈ పాదయాత్రకు కేంద్రమంత్రులను, జాతీయ నేతలను ప్రత్యేకంగా ఆహ్వానించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయబోతున్నారు. పాదయాత్ర తెరాస ప్రభుత్వం నిరంకుశ విధానాన్ని కట్టడమే లక్ష్యంగా సాగనుంది. ఇక హుజురాబాద్ ఉప ఎన్నిక అంశంపై ప్రజలు నిరంతరం దృష్టి పెట్టేలా కార్యాచరణను రూపొందించనున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఈ పాదయాత్ర చేస్తున్నట్టు బండి సంజయ్ బీజేపీ నేతలకు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: