మళ్ళీ లాక్ డౌన్ పొడిగింపు !

Chaganti
కరోనా సెకండ్ వేవ్ నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ మహమ్మారిని నియంత్రించడానికి దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ వంటి చర్యలు చేపట్టాల్సి వచ్చింది. అయితే నెమ్మదిగా కరోనా ప్రభావం తగ్గిపోవడంతో సడలింపులు ప్రకటిస్తూ వచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే లాక్ డౌన్ ఎత్తేశారు. కొన్ని నిబంధనలు మాత్రలు అలాగే ఉన్నాయి. అయితే తమిళనాడు మాత్రం ఇంకా లాక్ డౌన్ ను పెంచుతూనే ఉంది. అక్కడ ఇంకా కరోనా కేసులు కనిపిస్తుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

 10 రోజుల క్రితం వారం రోజులపాటు లాక్ డౌన్ ను పెంచుతున్నట్టు ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం మరోసారి అదే బాట పట్టింది. ఈసారి మరో వారం రోజులు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. జూలై 19 వరకూ అక్కడ లాక్ డౌన్ కొనసాగనుంది. ఆ తరువాత పరిస్థితుల దృష్ట్యా తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. అయితే లాక్ డౌన్ ను పొడిగిస్తూనే మరికొన్ని సడలింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అందులో భాగంగా షాప్ లను రాత్రి 9 గంటలదాకా ఓపెన్ చేసుకునే వెసులుబాటు కలిగించారు. పుదుచ్చేరికి బస్సు సర్వీసులను తిరిగి ప్రారంభించారు. రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లు 50% ఆక్యుపెన్సీతో నడుపుకోచ్చని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: