అక్రమ ప్రాజెక్టులకు కెసిఆరే కారణం.. !

ఏపీ తెలంగాణ మధ్య జల వివాదం కొనసాగుతూనే ఉంది. ఏపీ నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేస్తుండగా.. టిఆర్ఎస్ పార్టీ నాయకులు జగన్ పై విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు. అయితే తాజాగా తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కెసిఆర్, జగన్ ల‌పై విమర్శలు కురిపించారు. కృష్ణా నదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టులు కట్టేందుకు సీఎం కేసీఆరే కారణమన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు ఖరారు అవ్వాలనే రెండవ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కేసీఆర్ వాయిదా వేశారని అన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు సెంటిమెంట్ ను రెచ్చగొట్టాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. అంతే కాకుండా 2014 ఆంధ్రప్రదేశ్ రీ ఆర్గ‌నైజేష‌న్ యాక్ట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ రెండు బోర్డులు ఏపీ ఆర్ ఏ 2014 ప్రకారం రెండు రాష్ట్రాలు నదీజలాలను తమ వాటా ప్రకారం వాడుకునేలా పర్యవేక్షిస్తారని బండి సంజయ్ అన్నారు. అయితే ఈ బోర్డుల పరిధి ఇంకా నోటిఫై కాలేదని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: