డిల్లీ లో లాక్‌డౌన్ స‌డ‌లింపులు వీటికే

N.V.Prasd
న్యూఢిల్లీ :  దేశ రాజ‌ధాని ఢిల్లీలో లాక్‌డౌన్ ఆంక్ష‌లు  స‌డ‌లిస్తున్నారు. పాక్షింకంగా కార్యక‌లాపాలు నిర్వ‌హించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.లాక్‌డౌన్ మాత్రం కొన‌సాగుతుంద‌ని కొన్నింటికి మాత్ర‌మే స‌డ‌లింపులు ఉంటాయ‌ని ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ తెలిపారు.జూన్ 7 నుంచి మాల్స్‌, షాపులు తెరుచుకుంటాయ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. డిల్లీ మెట్రో కూడా 50 శాతం ప్ర‌యాణికుల‌తో న‌డ‌స్తుంద‌న్నారు. స‌రి,బేసి సంఖ్య ప్రాతిప‌దిక‌న మార్కెట్లు, మాల్స్ తెర‌వాల‌ని కేజ్రీవాల్ తెలిపారు. ప్రైవేట్ కార్యాలయాలు 50% సిబ్బందితో పనిచేయడానికి అనుమతించారు.ప్రభుత్వ కార్యాలయాల గ్రూప్ ఎ సిబ్బంది 100%, గ్రూప్ బి 50% సిబ్బందితో పనిచేయడానికి అనుమ‌తిస్తున్న‌ట్లు సీఎం తెలిపారు.క‌రోనా వైర‌స్ థ‌ర్డ్‌వేవ్‌ని ఎదుర్కొవ‌డానికి ఢిల్లీ ప్ర‌భుత్వం సిద్దంగా ఉంద‌ని...పీడియాట్రిక్ టాస్క్‌ఫోర్స్‌ని కూడా ఏర్పాట్లు చేసిన‌ట్లు తెలిపారు. కొత్త వేరియంట్లు ఉంటే వాటిని గుర్తించ‌డానికి రెండు జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌ల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు కేజ్రీవాల్ తెలిపారు.క‌రోనా మూడ‌వ ద‌శ‌కు సిద్దంగా 420 ట‌న్నుల ఆక్సిజ‌న్ నిల్వ చేయ‌గ‌ల సామ‌ర్థం ఉంద‌న్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: