త‌మిళ‌నాడులో లాక్‌డౌన్ పొడిగింపు... ఎన్నిరోజులంటే..?

N.V.Prasd
త‌మిళనాడులో లాక్‌డౌన్ ని జూన్ 14 వ‌ర‌కు పొడిగిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. త‌మిళ‌నాడులోని 11 జిల్లాలో ఆంక్ష‌లు స‌డ‌లించ‌డంలేద‌ని ప్ర‌భుత్వం పేర్కొంది. 11 జిల్లాలో క‌రోనా కేసులు ఎక్కువ‌గా న‌మోదవుతుండ‌టంతో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. కోయంబత్తూర్, నీలగిరి, తిరుప్పూర్, ఈరోడ్, సేలం, కరూర్, నమక్కల్, తంజావూర్, తిరువారూర్, నాగపట్నం మరియు మాయిలాదుత్తురై జిల్లాలో ఆంక్ష‌లు స‌డ‌లింపు ఇవ్వ‌లేదు.అయితే కిర‌ణాషాపులు, కూరగాయలు, పండ్లు,పూలు, మాంసం దుకాణాలను ఉదయం 6 నుండి సాయంత్రం 5 గంటల మధ్య మాత్ర‌మే తెరిచేందుకు అనుమ‌తించారు.50% మంది కార్మికులతో అగ్గిపెట్టె కర్మాగారాలు పనిచేయడానికి ప్రభుత్వం అనుమతించింది. ప్రభుత్వ కార్యాలయాలు 30% సిబ్బందితో తిరిగి పని ప్రారంభించాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. తమిళనాడులో కొత్తగా 22,651 క‌రోనా పాజిటివ్ కేసులు, 463 క‌రోనా మరణాలు నమోదయ్యాయ‌ని ప్ర‌భుత్వం తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: