ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు.. ఎప్పటి దాకా అంటే?
జూన్ పదో తారీకు వరకు కర్ఫ్యూ పొడిగిస్తున్నట్లుగా ప్రకటన వెలువడింది. ఇక ఇప్పటికే అమలులో ఉన్న ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు సడలింపు అలాగే కొనసాగనుంది. ఇక మరో పది రోజుల తర్వాత మళ్లీ సమీక్ష సమావేశం నిర్వహించి కేసులు తగ్గుదలను బట్టి ఆంక్షల సడలింపు ఉండే అవకాశం కనిపిస్తోంది.