ఆ శాఖ ఆదాయం కోసమే సడలింపు పెంచారా ?

Chaganti
తెలంగాణలో కరోనా కేసుల నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే సామాన్య ప్రజల వెసులుబాటు కోసం ముందు ఉదయం పది గంటల వరకు మాత్రమే సడలింపులు ఇచ్చిన ప్రభుత్వం తాజాగా ఆ సమయాన్ని ఒంటిగంట వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నిన్నటి దాకా ఉన్న లాక్ డౌన్ లో ప్రభుత్వ కార్యాలయాలు సైతం పని చేయలేని పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకి రిజిస్ట్రేషన్ ఆఫీసులకు ఒక్క పూట నడుపుకునే అవకాశం ఇవ్వడంతో పాటు ఆస్తి కొనుగోలు, వాహన రిజిస్ట్రేషన్ సేవలకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 


రెవెన్యూ ఆదాయం కోసమే ఆ నిర్ణయం తీసుకున్నారనే వాదన వినిపిస్తోంది. 2 గంటల  లోపు ఇంటికి వెళ్ళే నిర్ణయం కూడా అందుకేనని అంటున్నారు. నిజానికి రాష్ట్ర ఆదాయంలో మొదటి స్థానంలో లిక్కర్ ఉంటే ఆ తరువాతి స్థానాల్లో రెవెన్యూ శాఖ నిలుస్తుంది. రాష్ట్ర ఆదాయం తగ్గితే ఇబ్బందులు తప్పవు కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: