తెలంగాణలో లాక్ డౌన్ పొడిగింపు?

Chaganti
కరోనా కేసులు కట్టడి చేసేందుకుగాను తెలంగాణలో ప్రస్తుతం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. నిజానికి ముందు కొన్ని రోజుల పాటు లాక్ డౌన్ విధించాలని భావించారు కానీ కరోనా కేసులు ఏ మాత్రం కట్టడి కాకపోవడంతో ఈనెల 30వ తేదీ వరకు ఈ లాక్ డౌన్ అమల్లో ఉంటుందని గతంలో ప్రకటించారు. కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న కారణంగా వైరస్ వ్యాప్తి కాస్త తగ్గింది. 

పాజిటివ్ కేసుల సంఖ్య కూడా ఘనంగా తగ్గుతోంది. అయితే ఇంకా తగ్గాలి అంటే లాక్ డౌన్ మరో వారం రోజుల పాటు పొడిగించాలి అనే అంశం మీద ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వారం రోజుల పాటు లాక్ డౌన్ పొడిగించాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది.. ఈనెల 28వ తేదీన సీఎం కేసీఆర్ ఈ లాక్ డౌన్ అమలు, కరోనా కట్టడికి సంబంధించిన అంశాల మీద సమీక్ష జరపనున్నారు. ఆ సమీక్షలో లాక్ డౌన్ పొడిగించాలా ? వద్దా ? అనే అంశం మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: