పెరుగుతున్న పాజిటివిటీ..ప్రభుత్వం సంచలన నిర్ణయం..!!

Madhuri
క‌రోనా కేసులు క్ర‌మంగా పెరుగుతుండ‌డంతో మ‌రోసారి లాక్‌డౌన్‌ను పొడిగించింది ఒడిశా ప్ర‌భుత్వం. మే 5 నుంచి అమలు చేసిన రెండు వారాల లాక్‌డౌన్ ఈ నెల 19వ తేదీతో ముగియ‌నుండ‌గా..జూన్ 1వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగించింది. అయితే, ఒడిశాలో పాజిటివిటీ రేటు 20 శాతంగా ఉండ‌గా.. దాదాపు రెండు వారాల లాక్‌డౌన్ త‌ర్వాత ఇప్పుడు అది 18.2 శాతానికి త‌గ్గిన‌ట్టు ప్ర‌భుత్వం చెబుతోంది. మరోవైపు.. నిత్యావసర వస్తువుల లభ్యత కోసం ప్రభుత్వం ప్రతిరోజూ ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స‌డ‌లింపులు ఇస్తూ రాగా.. ఈ స‌మ‌యాన్ని ఇప్పుడు ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు కుదించింది. కఠినమైన ఆంక్షలు ఉంటాయ‌ని.. ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఒడిశా ప్ర‌భుత్వ‌ ప్రధాన కార్యదర్శి సురేష్ మోహపాత్రా మీడియాకు వెల్ల‌డించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: