భార్యా పిల్లలని బైక్ పై తీసుకెళ్తున్నాడు, ఒక్కడే మిగిలాడు...!

కర్నూలు జిల్లా మంత్రాలయంలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం నలుగురి ప్రాణాలు తీసుకుంది. నిర్లక్ష్యంగా ఐదుగురు కుటుంబ సభ్యులతో ఇంటి పెద్ద బైక్ పై ప్రయాణం చేస్తున్నాడు. మంత్రాలయం దాటిన వెంటనే వేగంగా బైక్ వెళ్లి  ఒక దిమ్మను ఢి కొట్టడంతో ప్రమాదంలో గాయపడిన ముగ్గురు పిల్లలు, తల్లి ప్రాణాలు కోల్పోయారు. 

 

ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడి  ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎవరు ఎన్ని చెప్పినా సరే ఫ్యామిలీతో బైక్ పై ప్రయాణం వద్దు అని... ప్రజల్లో మాత్రం మార్పు అనేది రావడం లేదు. ఇష్టం వచ్చినట్టు వెళ్తూనే ఉన్నారు ప్రమాదాలు కూడా అదే విధంగా జరుగుతున్నాయి. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: