పాటియాలాలో ఆగస్టు 1 నుంచి భారత బాక్సర్లకు కసరత్తు : డైరెక్టర్​ షాంటియాగో నీవా

Lokesh

 

ఆగస్టు 1 నుంచి బాక్సర్లకు పూర్తిస్థాయి శిక్షణ శిబిరం ప్రారంభమయ్యే అవకాశముందని పురుషుల బాక్సింగ్​ హై-పర్ఫార్మెన్స్ డైరెక్టర్​ షాంటియాగో నీవా చెప్పారు. పాటియాలాలోని నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆప్​ స్పోర్ట్స్​(ఎస్​ఐఎస్​)లో బాక్సర్లు తిరిగి శిక్షణ పొందేందుకు ఎన్​ఐఎస్​ అనుమతి ఇచ్చింది. ఈ క్రమలోనే తొలి బ్యాచ్​లో 13 మంది పురుషులు, ముగ్గురు మహిళలకు సదుపాయాలు కల్పించారు.మార్చి 25న అంటే లాక్​డౌన్​కు ముందు బాక్సర్లను వారి స్వస్థలలాకు పంపించారు. కానీ డైరెక్టర్​​ నీవా మూడు నెలలుగా ఎస్​ఐఎస్​లోనే చిక్కుకున్నారు. 

 

 

ప్రస్తుత పరిస్థితుల్లో తన స్వదేశమైన స్వీడన్​కు వెళ్లి.. తిరిగి భారత్​కు వచ్చే విషయంపై సందిగ్ధత నెలకొంది. అయితే, తాను స్వస్థలానికి వెళ్లే విషయమై బీఎఫ్​ఐతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.పాటియాలా వచ్చిన బాక్సర్లను స్వీయ నిర్బంధంలో ఉంచినట్లు నీవా తెలిపారు. స్పోర్ట్స్​ అథారిటీ ఆఫ్​ ఇండియా, స్టాండర్డ్​ ఆపరేటింగ్​ ప్రొసీజర్స్​(ఎస్​ఓపీ) నిబంధనలను అనుసరించి.. టోక్యో ఒలింపిక్స్​లో పాల్గొనే బాక్సర్లు శిక్షణను తిరిగి ప్రారంభించేందుకు ఎస్​ఐఎస్​కు రానున్నారు. ప్రస్తుతం ఎటువంటి పోటీలు లేనందున శిక్షణ కొద్దిరోజులు వాయిదా పడినా ఫర్యాలేదని నీవా పేర్కొన్నారు. అయితే, ఆటగాళ్లంతా ఆగస్టు 1 నాటికి ఎన్​ఐఎస్​లో ఉంటే మంచిదని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: