మొటిమలు రాకుండా ఖచ్చితంగా తీసుకోవలసిన జాగ్రత్తలు?

Purushottham Vinay
ముఖం పై మొటిమలు రాకుండా ఖచ్చితంగా తీసుకోవలసిన జాగ్రత్తలు:

నూనె పదార్ధాలు తినే వారికి చాలా ఎక్కువగా మొటిమల సమస్య ఉంటుంది. మీరు జిడ్డు చర్మాన్ని కలిగి ఉంటే నూనె, కొవ్వు పదార్థాలు తినడం పూర్తిగా తగ్గించాలి. మొటిమలను గిల్లడం వంటి పనులు మీరు అస్సలు చేయకూడదు.ఎందుకంటే గిల్లితే ఖచ్చితంగా మొటిమలతో పాటు బ్లాక్‌హెడ్స్ కూడా పెరిగే ప్రమాదం కూడా ఉంది.ఇంకా ఖచ్చితంగా ముఖాన్ని సబ్బుతో రోజులో రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. మన ఇంట్లో దొరికే పండ్లుతో, వెజిటేబుల్స్‌తో చర్మాన్ని బాగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి.చర్మానికి ఉపయోగించే మాస్క్‌లు, ఫేషియల్స్, స్క్రబ్బింగ్లు ఇంకా అలాగే సౌందర్య సాధనాలు మీ చర్మ తత్వానికి సరిపోయే విధంగా ఉన్నాయో లేదో తెలుసుకొని వాటిని వాడుకోవటం మంచిది.ఇక మొటిమల సమస్య ఎక్కువగా ఉన్నవారు  నీరు ఎక్కువ తాగితే మంచిది. ఎందుకంటే నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న టాక్సీన్స్ ఇంకా చెడు నీరు మూత్రం ద్వారా చాలా ఈజీగా బయటకు వెళ్లిపోతాయి. అందువల్ల శరీరం తేలికగా ఇంకా సున్నితంగా తయారవుతుంది.అలాగే ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు. 


స్వీట్స్, కూల్‌డ్రింక్స్ వాడకం కూడా తగ్గించాలి.అలాగే ఫ్యాట్, నూనె పదార్థాలు ఇంకా మసాలాలను వారంలో ఒకరోజు మాత్రమే తినాలి. సున్నిపిండితో ముఖం కడుక్కోవడం, క్రీమ్‌ల వాడకం తగ్గించడం ఇంకా అలాగే కంటి నిండా నిద్ర పోవటం వంటి జాగ్రత్తలు పాటించాలి.అనవసరమైన క్రీములు అస్సలు రాయకూడదు. వీటి వల్ల చర్మంలోని తైల గ్రంథులు మూసుకుపోవడమేకాక మొటిమలు కూడా చాలా తీవ్రమవుతాయి.  ముఖానికి మేకప్‌ తక్కువగా వేసుకోవాలి. అలాగే పడుకునేప్పుడు మేకప్‌ను అలాగే ఉంచుకోకుండా పూర్తిగా కడుక్కోవాలి.మీ తలకు నూనె, క్రీముల వంటివి వాడితే.. అవి ముఖమంతా కూడా విస్తరించి, మొటిమలు  ఎక్కువ కావటానికి కారణమయ్యే అవకాశం ఉంటుంది.ప్రతి రోజూ షాంపూతో తలస్నానం చేయటం వల్ల మీ ముఖం జిడ్డు లేకుండా చూసుకోవచ్చు.ప్రతి రోజూ కూడా క్రమం తప్పకుండా వ్యాయామం ద్వారా కూడా చర్మ సౌందర్యం అనేది బాగా మెరుగుపడుతుంది. ఇది మొటిమలు తగ్గేందుకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: