వైట్ హెయిర్ ని బ్లాక్ గా మార్చే న్యాచురల్ టిప్?

Purushottham Vinay
ప్రస్తుత కాలంలో చాలా మందికి కూడా చిన్న వయస్సులోనే తెల్ల వెంట్రుకలు ఎక్కువగా వస్తున్నాయి.అందువల్ల చిన్న వయస్సులోనే ముసలి వారి లాగా కనిపిస్తూ ఉంటారు. కొంతమంది ఈ తెల్ల వెంట్రుకలని కవర్ చేయడానికి ప్రమాదకరమైన కెమికల్స్ తో కూడిన రంగులు వేసుకుంటారు.కాని కెమికల్స్‌ను ఎక్కువగా వాడడం వల్ల అప్పటికప్పుడు సమస్య తగ్గుతుంది కానీ దాని వల్ల చర్మంపై సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ముఖ్యంగా ఆ కెమికల్స్ ఖచ్చితంగా మీ మెదడుపై ప్రభావం చూపిస్తాయి. దీంతో మీ ముఖంపై ముడతలు రావడం ఇంకా తలనొప్పి వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇంకా అలాగే ఇతర అనారోగ్యాల బారిన పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కెమికల్స్‌ను జుట్టుకు వాడడం అస్సలు మంచిది కాదు. అయితే ఈ సమస్య నుంచి బయట పడాలంటే అందుకు ఒక మంచి మార్గం ఉంది. ఆ మార్గం బిళ్ల గన్నేరు మొక్క. దీన్ని ఉపయోగించడం వల్ల అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి చాలా ఈజీగా బయట పడవచ్చు. ఇంకా అలాగే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.


ఈ బిళ్ల గన్నేరు మొక్కలు మనకు ఎక్కడ చూసినా కూడా కనిపిస్తాయి. ఈ మొక్కలకి పింక్‌, తెలుపు రంగులో ఉండే పూలను పూస్తాయి. అయితే ఏ మొక్క అయినా కానీ దాని ఆకులను సేకరించి వాటి నుంచి ఒక టీస్పూన్  రసాన్ని తీయాలి. ఇంకా ఓ నిమ్మకాయను పూర్తిగా పిండి రసం తీయాలి. దీనికి  కొబ్బరినూనెను కలపాలి. ఇక ఈ మూడింటినీ మిక్స్ చేసి మిశ్రమంగా చేయాలి. దీన్ని జుట్టు కుదుళ్లకు తగిలేలా బాగా మసాజ్ చేయాలి. అలాగే 1 గంట పాటు ఉండాలి.ఒక గంట సేపు  తరువాత   హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి.ఇలా ఖచ్చితంగా మీరు వారంలో కనీసం 2 నుంచి 3 సార్లు చేయాలి. ఇలా  చేస్తుంటే చాలా ఈజీగా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. దీంతోపాటు జుట్టు సమస్యలు కూడా ఈజీగా పోతాయి. ఇంకా అలాగే చుండ్రు కూడా తగ్గుతుంది.వెంట్రుకలు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి. కాబట్టి తెల్ల జుట్టు సమస్య ఉన్నవారు ఈ చిట్కాను పాటించండి. మీకు తప్పక ఫలితం కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: