టమాటాతో ఇలా చేస్తే అన్ని ముఖ సమస్యలు మాయం?

Purushottham Vinay
మీ చర్మంపై జిడ్డు ఈజీగా తగ్గాలంటే టొమాటోను కోసి ఆ రసాన్ని తీసి చర్మానికి పట్టించి ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు అలాగే ఉంచాలి.ఆ తరువాత మీరు చల్లటి నీటితో ముఖంని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేయడం వల్ల మీ చర్మం బాగా మెరిసిపోతుంది.ఇంకా అలాగే టొమాటో గుజ్జును తీసుకుని, దానికి 2 టేబుల్ స్పూన్ల ముల్తానీ మిట్టి ఇంకా అలాగే ఒక టీస్పూన్ పుదీనా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ చర్మంపై అప్లై చేయండి. ఇక అది ఆరిన తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఈ ప్యాక్ సన్ టాన్ ని ఈజీగా తొలగించి, టోన్డ్ ఇంకా అలాగే గ్లోయింగ్ స్కిన్ పొందడానికి సహాయపడుతుంది.ఇంకా అలాగే బ్లాక్ హెడ్స్ వదిలించుకోవడానికి పెరుగు, నిమ్మరసం ఇంకా టమోటాల మాస్క్‌ను తయారు చేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ కోసం మీరు 2 టేబుల్ స్పూన్ల టమోటా గుజ్జులో 1 టేబుల్ స్పూన్ పెరుగు ఇంకా అలాగే కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ప్యాక్ తయారు చేయాలి.తర్వాత దానిని మీ ముఖం అలాగే మెడపై అప్లై చేసుకోవాలి.


ఈ ప్యాక్‌ని వారానికి రెండు లేదా మూడు సార్లు అప్లై చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.అలాగే టమాటాని గుజ్జు, కొంచెం ఓట్స్, ఒక స్పూన్ పెరుగు కలిపి, ముఖానికి మెడకు బాగా పట్టించి కొన్ని నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే నల్లని చర్మం ఈజీగా తొలగిపొయి, చర్మం చాలా కాంతివంతంగాను ఇంకా అలాగే మృదువుగా మారుతుంది. టమాటా రసంలో, నిమ్మకాయ రసం కలిపి ముఖానికి ఇంకా మెడకు పట్టించి ఒక అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మీ ముఖం బాగా నిగనిగలాడుతుంది.ఇంకా అలాగే శనగపిండిని టమాట గుజ్జుతో కలిపి కొంచెం నిమ్మరసం వేసి ఆ పేస్ట్ ని ముఖానికి పట్టించి ఒక 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ఖచ్చితంగా మంచి ప్రభావం కనిపిస్తుంది. ఈ టమాటాల గుజ్జుని పాలతో కలిపి ముఖానికి పట్టించి ఒక 5 నిమిషాల తరువాత చల్లని నీటితో కనుక మీరు శుభ్రం చేసుకుంటే చర్మం చాలా కాంతివంతంగా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: