పొడవాటి నల్లటి జుట్టు కోసం ఇలా చెయ్యండి?

Purushottham Vinay
పొడవాటి, నల్లని, దట్టమైన, దృఢమైన, మెరిసే జుట్టు ఉంటే ఎంత బాగుండునని ఆడవాళ్లందరూ కూడా ఎంతగానో కోరుకుంటారు. కానీ ప్రస్తుత కాలంలోని బిజీ లైఫ్ స్టైల్ కారణంగా ఎవరికి వారు తమ జుట్టును జాగ్రత్తగా చూసుకోలేకపోతున్నారు..దీని వెనుక అనారోగ్యకరమైన ఆహారపుఅలవాట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. మంచి జుట్టు ఆరోగ్యానికి విటమిన్ సి చాలా ముఖ్యమైన పోషకం. కాబట్టి మెరిసే, ఆరోగ్యకరమైన జుట్టును పొందడానికి, మీరు విటమిన్ సి గల ఆహారం తీసుకోవటం ముఖ్యం.అందుకోసం విటమిన్‌ సి కలిగిన పలు రకాల హెయిర్ మాస్క్‌లను ట్రై చేస్తే జుట్టు ఆరోగ్యంగా అందంగా ఉంటుంది.మనం సలాడ్లు, పచ్చళ్లు, నిమ్మరసం చేయడానికి నిమ్మకాయను ఉపయోగిస్తాము. అయితే ఇది మన జుట్టుకు ఎంత మేలు చేస్తుందో మీకు తెలుసా. దీని రసాన్ని జుట్టుకు రాసుకుంటే జుట్టు సిల్కీగా, మృదువుగా తయారవుతుంది. దీన్ని ఉపయోగించడానికి నిమ్మరసం, ఆవాల నూనె కలిపి జుట్టుకు అప్లై చేయాలి.. ఇలా అరగంట అలాగే ఉంచి చివరగా తేలికపాటి షాంపూతో జుట్టును కడగాలి.


ఉసిరి చాలా ప్రయోజనకరమైనది. ఇది ఆయుర్వేద నిధిగా పరిగణించబడుతుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు జుట్టు, చర్మానికి చాలా ఉపయోగకరంగా పని చేస్తాయి. విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఉసిరి రసాన్ని జుట్టుకు పట్టిస్తే, అది మూలాల నుండి బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. జుట్టును మెరిసేలా చేస్తుంది. చుండ్రు సమస్య ఉన్నవారు కూడా సమస్య నుండి బయటపడతారు.నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్‌ సి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనితో తయారు చేసిన హెయిర్ మాస్క్ ను తలకు రాసుకుంటే జుట్టు మెరిసిపోయి ఒత్తుగా మారుతుంది. దీని కోసం ముందుగా నారింజ తొక్కను తీసి నీటిలో వేసి మరిగించాలి. ఆ తరువాత ఈ నీటిని గోరువెచ్చగా చేసి దానితో జుట్టును కడగాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మెరిసిపోవడం మొదలవుతుంది.కాబట్టి ఖచ్చితంగా పైన చెప్పిన టిప్స్ పాటించి జుట్టును అందంగా ఆరోగ్యంగా ఉంచుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: