అదిరిపోయే అందం కోసం ఈ బ్యూటీ టిప్స్ పాటించండి?

Purushottham Vinay
ఇప్పటికే బతుకమ్మ, దసర ముగిసింది. దీపావళి పండుగ కోసం సిద్దమవుతుంటారు. వివాహిత స్త్రీలు ప్రత్యేకంగా అలంకరణ, వస్త్రధారణపై శ్రద్ధ చూపే సందర్భం, చేతులకు గోరింట వేయడం నుంచి మొదలు.. అందమైన ముఖం వరకు అంతా సిద్దం చేసుకుంటారు. కానీ బ్యూటీ పార్లర్లలో ఫేషియల్స్ కోసం చాలా ఖర్చు చేస్తారు. దీని కారణంగా చాలా మంది మహిళలు దాని నుంచి దూరంగా ఉండేవారి సంఖ్య ఈ మధ్య కాలంలో పెరిగిపోయింది. అయితే ఇప్పుడు బ్యూటీ పార్లర్ల చుట్టు తిరగకుండానే బ్యూటీగా మారొచ్చు. పార్లర్‌కు వెళ్లకుండా ఇంట్లోనే దేశీ పద్ధతిలో ఫేషియల్ చేయించుకోవాలనుకునే మీ కోసం ఈ బ్యూటీ టిప్స్. తప్పకుండా పాటించండి.మొటిమలు, పిగ్మెంటేషన్ కారణంగా ముఖం చాలా అందవికారంగా కనిపిస్తుంది. మీకు కూడా అలాంటి సమస్య ఉంటే.. మీరు అరటి, పెరుగు సహాయంతో ఫేస్ మాస్క్‌ను సిద్ధం చేసుకోవచ్చు. దీని కోసం అరటిపండు తొక్క తీసి గిన్నెలో వేసి మెత్తగా చేయాలి. ఇప్పుడు అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల పెరుగు కలపాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. చివరగా గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖం బాగా మెరిసిపోతుంది.


మీ ముఖం మెరిసిపోవాలంటే పెరుగును క్లెన్సర్‌గా చేసుకోండి. దీని కోసం, మీ ముఖాన్ని తడిపి, దానిపై పెరుగును అప్లై చేసి తేలికపాటి చేతులతో మసాజ్ చేయండి. ఇప్పుడు టిష్యూ పేపర్ సాయంతో ముఖాన్ని శుభ్రం చేసి ఆరిపోయిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది క్లెన్సర్‌లా పనిచేసి ముఖానికి తాజాదనాన్ని తెస్తుంది.గుడ్డు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. అలాగే ఇది చర్మానికి కూడా మేలు చేస్తుంది. గుడ్డు మన చర్మం నుంచి అదనపు నూనె ప్రభావాన్ని తగ్గిస్తుంది. పెరుగుతో పాటు గుడ్డును ఉపయోగించడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. ఈ దేశీ ఫేషియల్‌ను సిద్ధం చేయడానికి .. మీరు ఒక చెంచా పెరుగు తీసుకునిజజ అందులో ఒక గుడ్డులోని తెల్లసొన కలపాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసి ముఖంపై నెమ్మదిగా మసాజ్ చేయండి. ఇప్పుడు అది ఆరిపోయే వరకు వేచి ఉండండి. చివరకు చల్లటి నీటితో శుభ్రం చేయండి.ఇలాంటి చిన్న చిన్న ఫేస్ మాస్క్ టిప్స్ తో మీరు కూడా ఇంట్లోనే అందంగా రెడీ కావచ్చు. ఇలా చేయడం వల్ల మీకు డబ్బులు కూడా ఆదా అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: