హెయిర్ ఫాల్ ని ఆపే ఈజీ టిప్?

Purushottham Vinay
ప్రస్తుత కాలంలో చాలా మందికి కూడా జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువగా కనబడుతోంది. జుట్టు కుదుళ్ళు బలహీనపడి జుట్టుకి అవసరమైన పోషకాలు లభించక జుట్టు రాలే సమస్య అనేది చాలా ఎక్కువ అవుతుంది.జుట్టు రాలే సమస్య నుంచి బయటపడటానికి ఇప్పుడు చెప్పే టిప్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.గుప్పెడు మందార ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి మిక్సీ జార్ లో వేయాలి. ఆ తర్వాత ఆరు వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి వేయాలి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకుని పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి మెత్తని పేస్ట్ గా మిక్సీ చేయాలి. ఈ పేస్ట్ ని ఒక బౌల్ లోకి తీసుకుని దానిలో ఒక స్పూన్ బాదం నూనె వేసి బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు రాసి ఒక గంట తర్వాత కుంకుడు కాయలతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలటం తగ్గి ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఈ ప్యాక్ వేయడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.


మందార ఆకులు జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలకుండా బలంగా ఉండేలా చేస్తుంది.ఇంకా వెల్లుల్లి స్కాల్ప్ దగ్గర ఉన్న కణాలను యాక్టివేట్ చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ఉల్లిపాయలో సల్ఫర్ ఉండటం వలన రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టు రాలకుండా .ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. అంతేకాకుండా చర్మం కింద ఉండే కొల్లెజన్ మెస్ ని పాడవకుండా రక్షించి దానిలో ఉండే కణాలను ఆక్టివేట్ చేసి ఒక వెంట్రుక ఊడిన దగ్గర నాలుగు వెంట్రుకలు వచ్చేలా చేస్తుంది.ఈ ప్యాక్ లో ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ లో ఉన్న లక్షణాలు మరియు పోషకాలు జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. ఈ చిట్కాను ఫాలో అయితే చాలా తక్కువ ఖర్చుతో జుట్టు రాలే సమస్య నుండి బయట పడవచ్చు. కాబట్టి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈజీగా జుట్టు రాలే సమస్య నుండి బయట పడండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: