మెరిసే హెల్తీ స్కిన్ కోసం అదిరిపోయే టిప్స్?

Purushottham Vinay
మెరిసే హెల్తీ స్కిన్ కోసం అదిరిపోయే టిప్స్.. కొబ్బరి నూనెలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. చర్మం మృదువుగా ఉండేందుకు ఇది దోహదపడుతుంది. శరీరంలో ఉన్న వేడిని తగ్గించడంలో కూడా కొబ్బరి నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కలబందలో అద్భుతమైన ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. కణాల పెరుగుదలను ఇది ప్రోత్సహిస్తుంది. ఇది ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం మృదువుగా, తేమగా ఉంటుంది. మొటిమల వల్ల వచ్చే నల్ల మచ్చలను తగ్గించుకునేందుకు కూడా కలబంద గుజ్జుతో ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. ఇది చర్మానికి మరింత అందాన్ని ఇస్తుంది.శరీరానికి నీరు చాలా అవసరం. నీళ్ళు ఎంత ఎక్కువ తాగితే చర్మం అంత ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటుంది. శరీరాన్ని డీ హైడ్రేట్ నుంచి రక్షిస్తుంది.హానికరమైన UV కిరణాల నుంచి చర్మాన్ని రక్షించుకోవడం కోసం సన్ స్క్రీన్ లోషన్ తప్పనిసరిగా ఉపయోగించాలి. ఆరోగ్యకరమైన చర్మ కాంతి కోసం ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ పోషకాలతో నించిన ఆహారాన్ని తీసుకుంటే గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.


ఆరోగ్యకరమైన కొవ్వులు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇది తినడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉండటమే కాదు చర్మం మెరుస్తూ ఉండేలా సహాయపడుతుంది.శరీరానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఆరోగ్యకరమైన చర్మం కోసం ఇది మంచి ఎంపిక. ఇందులో ఒమేగా 3, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటడం వల్ల చర్మ సంరక్షణకు బాగా ఉపయోగపడుతుంది.నట్స్, విత్తనాలు చర్మానికి చాలా పోషకాలు అందిస్తాయి. ఇందులో విటమిన్ ఇ, సెలీనియం, జింక్ సమృద్ధిగా ఉంటాయి.చర్మ సంరక్షణకు అద్భుతమైన కూరగాయ ఇది. ఇందులో విటమిన్ ఎ, సి, జింక్ ఎక్కువగా ఉంటాయి. బీటా కెరొటిన్ లాగా పనిచేసే ల్యూటిన్ ఇందులో లభిస్తుంది.టొమాటోలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. లైకోపిన్ వంటి అనేక రకాల కెరొటీనాయుడ్ లు ఎక్కువగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: