తెల్ల జుట్టు: ఇలా చేస్తే అసలు రానే రాదు?

Purushottham Vinay
జుట్టు తెల్లగా మారడానికి ప్రధాన కారణం ఏంటంటే జన్యుపరమైన కారణాలు ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. కానీ మారుతున్న జీవనశైలి కారణంగా ఈ సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కావున ఖచ్చితంగా ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిది. ఇక అంతేకాకుండా స్ట్రీట్‌ ఫుడ్‌ తినడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.ఇక ప్రతి భారతీయ వంటకాల్లో కరివేపాను వినియోగిస్తారు. ఇది కేవలం ఆహార రుచిని పెంచడమే కాకుండా శరీరానికి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఇంకా అంతేకాకుండా వెంట్రుకలను నల్లగా మార్చేందుకు సహాయపడుతుంది. అయితే ఈ కరివేపాకును జుట్టును నల్లగా మార్చేందుకు ఎలా సహాయపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందులో ఉండే బీటా, కెరోటిన్ ఇంకా ప్రొటీన్లు జుట్టును నల్లగా చేసేందుకు చాలా సహాయపడుతుంది. దీని కోసం ఆకులను పేస్టులా చేసి ఈ మిశ్రమాన్ని మీ తలకు పట్టించి.. తరువాత ఆరిపోయే దాకా ఉంచి బాగా శుభ్రం చేయాలి.


ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల జుట్టు సమస్యలన్ని కూడా చాలా ఈజీగా మాయమవుతాయి.ఇంకా అలాగే ఉసిరికాయలో చాలా రకాల ఔషధ గుణాలుంటాయి. అయితే దీనిని క్రమం తప్పకుండా ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలో అన్ని సమస్యలు కూడా ఈజీగా దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు పేర్కొన్నారు.ఈ జుట్టు సమస్యలు పోవడానికి ప్రతిరోజూ కూడా ఒక గ్లాసు ఉసిరి రసం తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల జుట్టు చాలా సహజంగా కుదుల్ల నుంచి నల్లగా మారుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇంకా అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు శరీర రోగనిరోధక శక్తి ని పెంచుతుంది.నిమ్మ, నారింజ ఇంకా అలాగే ద్రాక్షపండు వంటి పండ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల జుట్టు నెరసిపోవడం ఇంకా అలాగే బలహీనపడం వంటి సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటి వల్ల చాలా తొందరలోనే జుట్టు పెరగడంపై ఈజీగా ప్రభావం చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: