న్యాచురల్ బ్యూటీ కోసం ఇలా చెయ్యండి!

Purushottham Vinay
ఇక ఈ వర్షాకాలం అనేది మీకు ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగించినా కానీ వాతావరణంలో మార్పు చర్మాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.ఇక వర్షాకాలంలో కూడా చెమట చాలా ఎక్కువగా పడుతుంది. ఇక మన శరీరం నుంచి చెమట వల్ల చాలా నీరు పోతుంది. దీంతో నిర్జలీకరణం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి తగినంత నీటిని ఖచ్చితంగా తాగడం చాలా అవసరం. రోజుకు ఖచ్చితంగా కనీసం 7 నుంచి 8 గ్లాసుల నీరు తాగాలి. ఇక ఇది మీ చర్మాన్ని పొడిబారకుండా కాపాడుతుంది. దుంపలు, క్యారెట్, దోసకాయ ఇంకా గోధుమ గడ్డితో తయారు చేసిన పానీయాలు తాగాలి. ఇవి మిమ్మల్ని రోజంతా కూడా హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి.ఇక అంతేకాకుండా శరీరం నుంచి హానికారక టాక్సిన్లను బయటకు పంపడంలో కూడా ఈజీగా సహాయపడతాయి.ఇంకా వర్షాకాలంలో పుల్లని ఆహారాలు తీసుకోవడం తగ్గించాలి. పెరుగు, చింతపండు, సిట్రస్ పండ్లు ఇంకా వెనిగర్ తీసుకోవడం మానుకుంటే మంచిది. పులియబెట్టిన ఆహారం, ఉప్పు ఇంకా మసాలా ఆహారం శరీరంలో కఫాన్ని పెంచుతుంది. అంతేకాకుండా చర్మంపై మొటిమలు, దురద ఇంకా తామర వంటి సమస్యలు తలెత్తుతాయి.


ఈ వర్షాకాలంలో చర్మ రంధ్రాలు మూసుకుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మచ్చలు ఇంకా మొటిమలు వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి పరిష్కారంగా ఆయుర్వేద ఫేస్‌ ప్యాక్‌లను మీరు ఉపయోగించవచ్చు. పసుపు, కలబంద, చందనం ఇంకా వేపతో చేసిన హెర్బల్ ఫేస్ ప్యాక్‌లను ఉపయోగించవచ్చు. ఇది చర్మంలోని మచ్చలను ఈజీగా తొలగించి, తాజాగా ఉంచుతుంది.ఈ వర్షాకాలంలో తేమ కారణంగా ఇన్ఫెక్షన్‌ త్వరగా వస్తుంది. వేప ఇంకా పసుపు వంటి మూలికా నూనెలతో చర్మాన్ని మసాజ్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుకోవచ్చు. ప్రతి రోజూ కూడా స్నానానికి ముందు ఈ నూనెలను మసాజ్ చేయడం వల్ల చాలా మంచి ఫలితం అనేది మీకు ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: