హెయిర్ ఫాల్ కి చెక్ పెట్టడానికి సూపర్ న్యాచురల్ టిప్!

Purushottham Vinay
ఇక ప్రస్తుతం ఉన్న జీవన శైలి కారణంగా మన అలవాట్లు ఇంకా అలాగే ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. అలాగే ఈ రోజుల్లో పని బాగా ఎక్కువయ్యి దాని ఒత్తిడి ఇంకా అలాగే ఆహారపు అలవాట్లు వంటి అనేక రకాల కారణాలతో జుట్టు రాలిపోతుంది. ఈ సమస్యతో చాలా మంది కూడా ఎన్నో రకాలుగా తెగ ఇబ్బందులు పడుతుంటారు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా వారికి పాపం ఎలాంటి లాభం అనేది ఉండదు.ఈ సమస్య కోసం మార్కెట్ లో దొరికే ఖరీదైన ఉత్పత్తులను వాడవలసిన అవసరం అనేది లేదు.అలాగే మన వంటింటిలో సహజసిద్దంగా దొరికే రెండు వస్తువులను ఉపయోగిస్తే సరిపోతుంది.రెండు స్పూన్ల మెంతులను తీసుకోని వాటిని నీటిలో బాగా నానబెట్టి రాత్రంతా కూడా అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయను తీసుకొని పై తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేసి రసంని తీసుకోవాలి. ఉల్లిపాయ రసంలో మెంతుల పేస్ట్ ని కలిపి జుట్టు కుదుళ్ల నుండి చివర్ల దాకా బాగా పట్టించాలి.ఇక ఒక అరగంట ఆగిన తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి.


ఇక ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తూ ఉంటే సరిపోతుంది. జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉన్నవారు వారంలో రెండు సార్లు కనుక ఇలా చేస్తే ఖచ్చితంగా వారికి మంచి ఫలితం కనపడుతుంది. ఉల్లి రసం జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు ఒత్తుగా పెరగటానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది.అలాగే మెంతులు తలలో వేడిని ఇంకా అలాగే ఒత్తిడిని తగ్గించి జుట్టు ప్రకాశవంతంగా మెరిసేలా కూడా చేస్తుంది.అలాగే పొడి జుట్టు ఉన్నవారు ఈ పేస్ట్ లో ఒక స్పూన్ కొబ్బరి నూనె లేదా ఆముదంని కనుక కలిపితే మంచి ఫలితం అనేది ఉంటుంది. ఉల్లి ఇంకా అలాగే మెంతులు జుట్టు సంరక్షణలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.కాబట్టి ఖచ్చితంగా ఇలా చెయ్యండి. అన్ని రకాల జుట్టు సమస్యలను చాలా ఈజీగా పోగొట్టుకోండి. ఎల్లప్పుడూ కూడా ఈ న్యాచురల్ టిప్స్ ఫాలో అయ్యి ఆరోగ్యంగా ఇంకా అలాగే అందంగా వుండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: