పెదాలు ఎర్రగా మృదువుగా అందంగా అయ్యే ఈజీ టిప్!

Purushottham Vinay
పెదాలు అందంగా ఇంకా అలాగే ఎంతో ఆకర్షణీయంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు. కానీ ఆహారపు అలవాట్లు,వాతావరణంలో కాలుష్యం, వేసవిలో ఉండే డీహైడ్రేషన్ ఇంకా అలాగే అధిక వేడి వంటి అనేక రకాల కారణాలతో వారి పెదాలు పొడిగా మారి పగులుతూ ఉంటాయి.కొంతమంది పెదాలు అయితే నల్లగా కనిపిస్తాయి.కొంతమంది పెదాలు పగిలిపోయినట్లు కనిపిస్తాయి. ఇక అలాంటి వారి కోసం ఈ అద్భుతమైన చిట్కా. తప్పకుండ చదివి ఆ చిట్కాని పాటించండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అనేది కనపడుతుంది.ఇక ఈ వేసవి కాలంలో విరివిగా లభించే అనాస పండు మీ పగిలిన పెదాలను బాగా మృదువుగా చేస్తుంది. అలాగే అనాసపండు తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసి బాగా మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ నుంచి రసంని బయటకి తీయాలి. ఒక బౌల్ లో రెండు స్పూన్ల అనాస రసం, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ ఇంకా అలాగే రెండు చుక్కల విటమిన్ E ఆయిల్ వేసి బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని మీ పెదాలకు రాసి ఒక 5 నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.


ఈ విధంగా రోజులో ఉదయం ఒకసారి ఇంకా అలాగే సాయంత్రం ఒకసారి చేస్తూ ఉంటే క్రమంగా పెదాల పగుళ్లు ఇంకా నలుపు అనేది ఈజీగా తగ్గి పెదాలు మృదువుగా గులాబీ రంగులోకి మారతాయి. ఇక ఈ మిశ్రమంను ఫ్రిజ్ లో పెడితే నాలుగు రోజులు పాటు నిల్వ ఉంటుంది.అనాస పండులో అనేక రకాల మంచి ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా అనేక రకాల బ్యూటీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పైనాపిల్ అనేది సహజమైన ఎక్స్‌ఫోలియేటర్ గా   కూడా బాగా పనిచేస్తుంది. ఇది చర్మం నుండి చనిపోయిన చర్మాన్ని తొలగించడంలో చాలా బాగా సహాయపడుతుంది. పగిలిన పెదవులను ఎంతో మృదువుగా కూడా చేస్తుంది. కాబట్టి ఈ చిట్కా పాటించి పగిలిన పెదాలను ఇంకా అలాగే నల్లటి పెదాలను బాగా మృదువుగా మార్చుకోండి. కాబట్టి ఖచ్చితంగా ఈ చిట్కాను పాటించండి. మీ పెదాలను బాగా ఎర్రగా ఇంకా సాఫ్ట్ గా మార్చుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: